ఐదు నిమిషాలు వాడుకుంటాం అని హీరోలను అడుకోవాల్సి వస్తుంది..బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-07-25 06:09:05  IST  )

ఐదు నిమిషాలు వాడుకుంటాం అని హీరోలను అడుకోవాల్సి వస్తుంది..బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా (Nushrat Barucha).. టీవీ సీరియల్స్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా రాణిస్తుంది. ఇక హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఈమె.. తన అందం, నటనతో బాగానే మార్కులు కొట్టేసింది. చివరగా.. చోరీ-2 అనే హారర్ చిత్రంలో నటించిన నుష్రత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోలకు, హీరోయిన్‌లకు సమానత్వం ఉండదు అని తెలిపింది. ‘హీరో హిట్ కొట్టగానే అతడికి కనీసం నాలుగైదు సినిమా ఆఫర్లు అయినా వస్తాయి. కానీ హీరోయిన్స్ పరస్థితి అలా ఉండదు. ఆఫర్ల కోసం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి.

ఎవరైనా సినిమాతో సక్సెస్ అందుకున్నాక.. మరిన్ని మంచి ప్రాజెక్టులు రావాలని కోరుకుంటారు. కానీ హీరోయిన్స్‌కు అంత అదృష్టం ఉండదు.. హీరోలకు వచ్చిన ఆఫర్స్ మాకు రావు. అలాగే షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసరమైతే హీరో వానిటీ వ్యాన్‌ను ఐదు నిమిషాలు వాడుకోవచ్చా? అని అడగాల్సిన పరిస్థితి కూడా నేను ఫేస్ చేశాను. అప్పుడు హీరోకు ఉన్నన్ని వసతులు, సౌకర్యాలు నాకు లేవని గొడవ చేయలేదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని బలంగా కోరుకున్నాను’ అని తెలిపింది.

Next Story