- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంజయ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు.. ఆ విషయం నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది: సందీప్ కిషన్
సంజయ్ చాలా కష్టపడి పనిచేసే అబ్బాయి. అతను, అతని టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్, ఎడిటింగ్ పనులను చాలా పకడ్బందీగా పూర్తి చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘సిగ్మా’. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తుండగా, సందీప్ కిషన్ సరసన ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంతో పక్కా ప్లానింగ్‌తో కేవలం 65 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిత్రాన్ని జూలై 31న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ వరుస అప్‌డేట్లతో అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో సందీప్ కిషన్, దర్శకుడు జాసన్ సంజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
"సంజయ్ చాలా కష్టపడి పనిచేసే అబ్బాయి. అతను, అతని టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్, ఎడిటింగ్ పనులను చాలా పకడ్బందీగా పూర్తి చేశారు. ముఖ్యంగా సంజయ్ నుండి సహనం గురించి చాలా నేర్చుకోవచ్చు, అతని ఓపిక చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూ.. అంత సహనంతో, ప్రశాంతంగా, తనకు ఏం కావాలో ఆ అవుట్‌పుట్‌పై పూర్తి స్పష్టతతో ఉండటం నిజంగా అద్భుతం" అని సందీప్ కిషన్ కొనియాడారు. అంతేకాకుండా.. "సంజయ్ విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్ కోర్సులు చదువుకున్నాడు. అంత చిన్న వయసున్న దర్శకుడితో నేను పని చేసి చాలా కాలం అయింది. అతను చూసేందుకు అచ్చం తన తండ్రి నటుడు విజయ్ లాగే కనిపిస్తాడు. మనం లైఫ్‌లో కలిసే అత్యంత సాధారణ, వినయపూర్వకమైన వ్యక్తులలో సంజయ్ ఒకడు" అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.






