- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి
డార్లింగ్ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా రీ-రిలీజ్ అయిన నేపథ్యంలో అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలలో డార్లింగ్ ఆడుతోన్న థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే డార్లింగ్ సినిమాను కూడా రీలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ వివాదాస్పద సంఘటన తెరపైకి వచ్చింది.
సాంగ్స్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
డార్లింగ్ సినిమా చూసేందుకు వచ్చిన ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి చేసినట్లు వీడియో వైరల్ గా మారింది. సుదర్శన్ ( Sudarshan 35MM) థియేటర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక షోలో డార్లింగ్ సినిమా సాంగ్స్ వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలిపారు. ఈ తరుణంలోనే సాంగ్స్ వేయాలని అడిగిన అభిమానిపై దాడి జరిగినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్.. థియేటర్ ముందు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. క్లిక్






