- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రోయింగ్ బ్యాక్ పిక్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. నీకంటే నీ ఫ్రెండే బాగుందంటూ కామెంట్స్..
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో.. ‘నా జీవితంలోని యాదృచ్ఛిక దశలకు తిరిగి వెళ్తున్నాను.. vfx* - మూడవ స్లయిడ్ టైపింగ్ తప్పుగా పడింది’ అని రాసుకొస్తూ గతంలో తీసుకున్న కొన్ని ఫొటోస్‌ను షేర్ చేసింది. ఇక వాటిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డే, ఫస్ట్ ప్రొఫెషనల్ ఫొటో షూట్, చిన్నప్పటి ఫొటో, ఐరన్ మ్యాన్ గెటప్‌లో ఉన్న పిక్, స్టేజ్ పర్ఫామెన్స్ ఫొటో, తన ఫస్ట్ సాంగ్ ఫిక్, పీజెంట్ డేస్ పిక్, ఇస్మార్ట్ శంకర్ మూవీ పోస్టర్, చిన్నప్పుడు టైగర్‌ను చూసిన ఫొటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫొటోస్‌లో ఉన్న నభాకు ఇప్పుడు ఉన్న నభాకు చాలా తేడా ఉంది. ఇక వాటిని చూసిన నెటిజన్లు గుర్తు పట్టడం కష్టంగానే ఉందిగా అని, నీ కంటే నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.






