- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనితో ఉన్న క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. పర్ఫెక్ట్ జోడి అంటూ కామెంట్స్(పోస్ట్)
రాకింగ్ స్టార్ యష్(Yash) నటించిన కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యష్(Yash) నటించిన కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా నాని(Nani) సరసన ‘హిట్-3’(Hit-3) సినిమాలో నటించి మెప్పించింది. మే 1న రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో నాని హీరోతో దిగిన క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. ఇక వాటికి.. ‘వర్షపు సాయంత్రం, మంచి ఓల్డ్ మ్యూజిక్ అండ్ అన్ని అనుభూతులతో కూడిన మోనోక్రోమ్ చిత్రాల సమితి.. అయితే ఈ మ్యాజిక్ క్రియేట్ కావడానికి మెయిన్ రీజన్ శైలేష్ కొలను’ అని అతన్ని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు పర్ఫెక్ట్ రీల్ జోడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






