గోల్డెన్ శారీలో అదరహో అనిపిస్తున్న యంగ్ బ్యూటీ.. స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గోల్డెన్ శారీలో అదరహో అనిపిస్తున్న యంగ్ బ్యూటీ.. స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసిన ఈ బ్యూటీ రీసెంట్‌గా.. నితిన్(Nithin) సరసన ‘రాబిన్ హుడ్’(Robbin Hood) మూవీలో నటించి మెప్పించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో గోల్డెన్ కలర్ శారీ కట్టుకొని ఒంటినిండా నగలతో సింగారించుకుంది. కళ్యాణ్ జ్యూవెలర్స్ షాపింగ్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ కారులో నుంచి దిగుతున్న ఫొటోస్‌తో పాటు మరికొన్ని అందమైన పిక్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story