- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూట్ లుక్స్‌తో కిల్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. చిరునవ్వులు అండ్ మంచి భావోద్వేగాలను మీకు పంపుతోందంటూ పోస్ట్
యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఉప్పెన’(Uppena) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ చిన్నది. బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే స్టార్టింగ్‌లో ఆమె ఖాతాలో మంచి హిట్సే పడ్డప్పటికీ తర్వాత కాలంలో వరుస అపజయాలు ఎదురయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చేసేది ఏమిలేక కోలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ చిన్నది తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో హెయిర్ లీవ్ చేసుకొని స్లీవ్‌లెస్ డ్రెస్సువేసుకుంది. అలాగే క్యూట్ స్మైల్ చేస్తూ కుర్రకారు గుండెల్ని కిల్ చేస్తుంది. ఇక ఈ పిక్స్‌కు.. ‘చిరునవ్వులు అండ్ మంచి భావోద్వేగాలను మీకు పంపుతోంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






