15 ఏళ్ల క్రితం పెను సంచలనం.. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు.. ఆదరిస్తారా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-23 16:30:40  IST  )

15 ఏళ్ల క్రితం పెను సంచలనం సృష్టించిన వీడియో సాంగ్ మళ్లీ వస్తోంది...

15 ఏళ్ల క్రితం పెను సంచలనం.. ఇప్పుడు మళ్లీ  ప్రేక్షకుల ముందుకు.. ఆదరిస్తారా..?
X

దిశ, వెబ్ డెస్క్: సింగర్ మధు ప్రియ(Singer Madhu Priya) పాడిన ‘ఆడపిల్లనమ్మా’ వీడియో పాట(Adapillanamma Video Song) 15 ఏళ్ల క్రితం ఎంత సెన్సేషనల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటకు అనూహ్య స్పందన రావడమే కాకుండా ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. సాధారణ సింగర్‌గా ఉన్న మధు ప్రియకు ‘ఆడపిల్లనమ్మా’ సాంగ్ ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చింది. దీంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆడపిల్లలు పడే కష్టాన్ని వివరిస్తూ పాడిన ఈ వీడియో సాంగ్ అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటను రీ రిలీజ్ చేసేందుకు సింగర్ మధు ప్రియ సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆడపిల్లనమ్మా’ సాంగ్ కమింగ్ సూన్ అంటూ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 15 ఏళ్ల తర్వాత మీ ముందుకు ‘ఆడపిల్లనమ్మా’ వీడియో సాంగ్ వస్తోందని, ప్రేక్షకులు ఈ వెర్షన్‌నూ ఆదరిస్తారని మధు ప్రియ ఆశిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టర్ విడుదల చేశారు.

Next Story