- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో హీరోయిన్ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీమ్
ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవిని తీసేసి, రుక్మిణి వసంత్‌ను తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

దిశ, సినిమా: భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సాయి పల్లవి ప్రస్తుతం 'రామాయణ'తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. కాల్‌షీట్ల సమప్య కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే.. సాయి పల్లవి ప్లేస్‌లో కోలీవుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను తీసుకున్నట్లు కూడా నెట్టింట పుకార్లు షాకార్లు చేశాయి.
అయితే.. తాజాగా నిర్మాత బన్నీవాసు ద్వారా అందిన సమాచారం మేరకు.. ‘ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి తప్ప మరో ఆలోచన లేదు. ఆమెను మార్చామనే వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఈ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలదని టీమ్ బలంగా నమ్ముతోంది. రుక్మిణి వసంత్‌ను తీసుకున్నామనే దాంట్లో అస్సలు నిజం లేదు’ అని చెప్పారు. కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 2026 నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్లాసికల్ బయోపిక్‌కు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు.






