నటి కూతుళ్లకు బహుమతిగా బంగారు గాజులు ఇచ్చిన స్టార్ హీరో.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ నటి కనిక(Kanika) ‘దేవరాట్టం’ సినిమాలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ఆమె ప్రముఖ గేయ రచయిత స్నేహన్‌(Snehan)ను ప్రేమించింది.

నటి కూతుళ్లకు బహుమతిగా బంగారు గాజులు ఇచ్చిన స్టార్ హీరో..  ఆమె రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ నటి కనికKanika) ‘దేవరాట్టం’ సినిమాలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ఆమె ప్రముఖ గేయ రచయిత స్నేహన్‌Snehan)ను ప్రేమించింది. ఇక పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి ఫిబ్రవరి నెలలో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. కనిక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తమ పిల్లలను తీసుకుని కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన వీరితో అప్యాయంగా మాట్లాడి ఇద్దరు పిల్లలను ఎత్తుకుని చాలా ముద్దుగా ఉన్నకంటూ ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. ఆపై ఇద్దరికీ స్వయంగా తన చేతులతో బంగారు గాజులు తొడిగారు. అంతేకాకుండా ఆపై కనిక, స్నేహాన్‌లతో పాటు చిన్నారులకు కూడా బట్టలు పెట్టారు. ఈ విషయాన్ని తెలుపుతూ కనిక ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, స్నేహన్ విషయానికొస్తే.. ఆయన పలు సినిమాలకు పాటలు అందించారు. అలాగే కమల్ హాసన్‌కు దగ్గరగా ఉంటున్నారు. అయితే స్నేహన్ రాజకీయాల్లోనూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే..గత ఏడాది ‘ఇండియన్-2’ చిత్రంతో వచ్చి భారీ డిజాస్టర్‌ను చవిచూశారు. ఆ తర్వాత నటించిన ‘కల్కి’ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష, ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్లుగా నటిస్తుండగా.. రవి మోహన్, సిలంబారసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాను మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మువీస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.

Next Story