- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత శాతం పూర్తైన ‘డ్రాగన్’ షూటింగ్.. అయినా విడుదల తేదీ ఎందుకంత దూరం?
‘డ్రాగన్’ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన దాదాపు 50% షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే 50% షూటింగ్ పూర్తయినా విడుదల తేదీ ఎందుకు ఇంత దూరంగా పెట్టారు అనే అనుమానం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.
తాజా టాక్ ప్రకారం ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆ రెండు భాగాల షూటింగ్‌ను ఏకకాలంలో పూర్తి చేస్తున్న కారణంగానే పోస్ట్ ప్రొడక్షన్, ప్లానింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే 2027 జూన్ 11న మొదటి భాగాన్ని విడుదల చేయాలని, రెండవ భాగం కూడా ఆ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తారక్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






