- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రముఖ సంస్థ చేతికి 'తిమ్మరాజుపల్లి టీవీ' సీడెడ్ హక్కులు
'తిమ్మరాజుపల్లి టీవీ' సీడెడ్ హక్కులను (SLN సినిమాస్) సంస్థ దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విలేజ్ పీరియాడిక్ చిత్రం 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమాని టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం (K ప్రొడక్షన్స్) & సుమైర స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. మునిరాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కిరణ్ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నాడు.
ఈ మూవీ బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు జనాల్లో నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క సీడెడ్ హక్కులను (SLN సినిమాస్) సంస్థ దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే ఈ మూవీకి మంచి టాక్ వస్తే భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






