- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రముఖ సంస్థ చేతికి 'తిమ్మరాజుపల్లి టీవీ' నైజాం హక్కులు
తిమ్మరాజుపల్లి టీవీ చిత్రానికి సంబంధించిన నైజాం ఏరియా థియేటర్ హక్కులను 'SVC' సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సొంత నిర్మాణ సంస్థ 'కేఏ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై సుమైర స్టూడియోస్‌తో కలిసి 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. దాంతో కొన్ని రోజుల క్రితమే విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ బృందం విడుదల చేయించింది. ఆ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన ఇతర ప్రచార చిత్రాలు కూడా జనాలను బాగా ఆకట్టుకోవడంతో, ప్రస్తుతానికి ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్‌ను మూవీ బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం ఏరియా థియేటర్ హక్కులను 'SVC' సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థకు ఈ ఏరియాలో మంచి పట్టు ఉంది. అలాగే ఈ మూవీపై కూడా మంచి అంచనాలు ఉండడంతో, ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే నైజాం ఏరియా నుండి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






