- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న మెగా బ్యూటీ.. వైరల్ అవుతోన్న న్యూస్
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’(Uppena) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రంతో ఈ అమ్మడు గ్రాఫ్ చేంజ్ అయిపోయి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే చివరిగా నటించిన సినిమాలు అంతగా విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో ఆఫర్లు రావడం కూడా మానేశాయి. ఇక చేసేది ఏమి లేక టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి.. కోలీవుడ్ చెక్కేసింది.
అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కృతి శెట్టి మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తుందట. అందులోనూ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen)తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అనుదీప్(Anudeep) దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్(Sithara Entertainments Banner) ఈ మూవీని రూపొందిస్తుందట. ఇక ఈ చిత్రంలోనే హీరోయిన్‌గా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా ‘లైలా’(Laila) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ నారాయణ్(Ram Narayan) డైరెక్షన్‌లో.. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇందులో ఆకాంక్ష శర్మ(akanksha Sharma) హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించి రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.






