- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది నుంచి మరో క్రేజీ అప్డేట్..ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
చికిరి చికిరి సాంగ్ కోసం చిత్ర బృందం పడిన కష్టాన్ని చూపిస్తూ తాజాగా మేకింగ్ వీడియో

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్, వరస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో ( Peddi ) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ( Buchi Babu Sana) దర్శకత్వంలో వస్తున్న ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ( JanhviKapoor ) హీరోయిన్ గా మెరుస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా రిలీజ్ కాగానే, వెంటనే చూడాలన్న ఆత్రుత అందరిలోనూ పెరిగింది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి చికిరి చికిరి ( Chikiri Chikiri ) అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ పాట తెగ వైరల్ అయింది. చాలా మంది ఈ పాటకు రీల్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు ఈ పెద్ది సినిమా సాంగ్ 100 మిలియన్స్ న్యూస్ కూడా దాటేసింది.
ఈ నేపథ్యంలో చికిరి చికిరి సాంగ్ కోసం చిత్ర బృందం పడిన కష్టాన్ని చూపిస్తూ తాజాగా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పాటకు 100 మిలియన్స్ వ్యూస్ వచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు రామ్ చరణ్. పాటపై ప్రేక్షకులు చూపిన ప్రేమకు చాలా కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇది ప్రారంభం మాత్రమే, ముందు ముందు మరిన్ని సాంగ్స్ రాబోతున్నట్లు పోస్ట్ పెట్టారు. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) నటించిన ఈ పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. క్లిక్






