‘ఛాంపియన్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్టర్‌తోనే హైప్ పెంచేశారుగా

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-17 12:44:48  IST  )

రోషన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న సినిమా 'ఛాంపియన్'.

‘ఛాంపియన్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్టర్‌తోనే హైప్ పెంచేశారుగా
X

దిశ, వెబ్‌డెస్క్: రోషన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న సినిమా 'ఛాంపియన్'. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గిరిగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కానుంది అని మూవీటీమ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఛాంపియన్ ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభం కానుంది.. రేపు ట్రైలర్ విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ఒక మట్టి గోడ మీద రోషన్ కూర్చోని ఉండగా బ్యాక్ గ్రౌండ్‌లో కూడా అతనిదే మరో ఫొటో ఉంది. ఇక ఆ పిక్‌లో బ్యాగ్ షోల్డర్‌కు వేసుకుని ఎవరినో చూస్తున్నాడు.

కాగా ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అద్భుతమైన అల్బమ్ కంపోజ్ చేశారు. తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story