- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ క్షణం సినిమా విధిని నిర్ణయిస్తుంది.. ఇంట్రెస్టింగ్‌గా హీరో ఆది ట్వీట్
ఈ ఏడాది చివరలో ప్రేక్షకులకు భయపెట్టేందుకు రాబోతున్న చిత్రం ‘శంబాల’(Shambala).

దిశ, సినిమా: ఈ ఏడాది చివరలో ప్రేక్షకులకు భయపెట్టేందుకు రాబోతున్న చిత్రం ‘శంబాల’(Shambala). సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్(Aadi Saikumar) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యుగంధర్ ముని(Director Yugandhar Muni) దర్శకత్వం వహిస్తున్న ‘శంబాల’ నుంచి ఇప్పటికే వచ్చిన అన్ని అప్డేట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. మూవీపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. దీంతో సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది క్రిస్మస్ స్పెషల్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న ఈ చిత్రాన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే తాజాగా ‘శంబాల’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘ఇదంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.. ఉద్రిక్తంగా, ఉత్సాహంగా అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టుగా శంభాల ట్రైలర్ రాబోతున్నది. ఆ క్షణం సినిమా విధిని నిర్ణయిస్తుంది.. ప్రతి ఫ్రేమ్, ప్రతి హృదయ స్పందన.. మరింత రెట్టింపు అవుతోంది.. శంభాల ట్రైలర్ త్వరలో వస్తుంది రాబోతున్నది’ అంటూ హీరో ఆది ఉన్న క్లాపింగ్ పిక్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.






