వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన 'కన్నప్ప' టీమ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-25 06:12:49  IST  )

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం 'కన్నప్ప (Kannappa)'.

వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కన్నప్ప టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం 'కన్నప్ప (Kannappa)'. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా నిర్మిస్తోండగా ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. శివ భక్తుడు కన్నప్ప జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇక తిన్నడు/కన్నప్పగా విష్ణు నటించగా రుద్రగా రెబల్ స్టార్ ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటించారు. ఇంతమంది స్టార్స్‌ నటించడం, దివంగత హీరో కృ‌ష్ణంరాజు నటించిన 'భక్త కన్నప్ప' సినిమా తర్వాత దాదాపు 50 ఏళ్లకు కన్నప్ప కథ తెరపైకి వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని విష్ణు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో 'కన్నప్ప' మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాపై ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. కొంతమంది కావాలని సినిమాపై నెగిటీవ్ రివ్యూలు ఇస్తారని, అలాంటి వారిని సహించలేదని తెలిపింది.

Next Story