గోట్ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రెడిషనల్ లుక్‌లో ఎంత ముద్దుగుందో

by I. Sairam |

సుడిగాలి సుధీర్ (Sudigali Sudeer)హీరోగా నటిస్తున్న చిత్రం ‘G.O.A.T’(Greatest Of All Times).

గోట్ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రెడిషనల్ లుక్‌లో ఎంత ముద్దుగుందో
X

దిశ, వెబ్‌డెస్క్: సుడిగాలి సుధీర్ (Sudigali Sudeer)హీరోగా నటిస్తున్న చిత్రం ‘G.O.A.T’(Greatest Of All Times). దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ (Vedavyas) దర్శకత్వం వహించగా చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ దివ్యభారతికు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

‘గోట్ చిత్ర బృందం నుంచి మన అందమైన హీరోయిన్‌ దివ్య భారతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీకు ప్రేమ, విజయం మరియు అంతులేని చిరునవ్వులు కావాలని కోరుకుంటున్నాను. త్వరలో #GOAT తో రాక్ చేద్దాం’ అంటూ ఆమెకు విష్ చేశారు. ఇక పోస్టర్‌లో హీరోయిన్ మల్లెపూలు పెట్టుకొని రెడ్ కలర్ శారీలో నగలతో సింగారించుకుని చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story