‘మిరాయ్’ నుంచి వైబ్ ఉంది ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఓవరాల్‌గా అదిరిపోయిందంతే..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-26 05:55:46  IST  )

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai).

‘మిరాయ్’ నుంచి వైబ్ ఉంది ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఓవరాల్‌గా అదిరిపోయిందంతే..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai). కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్(Manchu Manoj) విలన్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad) నిర్మిస్తున్నారు. కాగా గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘వైబ్ ఉంది’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని లాంచ్ చేశారు. హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఇచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ మంచి క్యాచీగా ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పాల్సిందే. ముఖ్యంగా మధ్యలో వైబ్ ఉందిలే బేబీ అనే బీట్ మాత్రం అర్మాన్ మాలిక్ వాయిస్‌లో వింటేజ్ స్టైల్ సాంగ్‌ని తలపించింది. అలాగే కృష్ణకాంత్ ఇచ్చిన సాహిత్యం కూడా చాలా బాగుంది. ఇక సాంగ్‌లో తేజా సజ్జా చాలా స్టైలిష్‌గా కనిపించాడు. తన డాన్స్ మూమెంట్స్‌లో మంచి గ్రేస్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే తనతో పాటుగా రితికా మంచి గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఫైనల్‌గా కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఈ సాంగ్‌లో కనిపిస్తున్నాడు. ఓవరాల్‌గా మాత్రం మిరాయ్ నుంచి ఈ ఫస్ట్ సింగిల్ అదిరి పోయిందంతే. లింక్

Next Story