- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జైలర్ 2' చివరి పనులు ప్రారంభం
తాజాగా 'జైలర్ 2' మూవీ బృందం డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా జైలర్ 2 రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. తాజాగా మూవీ బృందం డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో అవి కూడా పూర్తయ్యే అవకాశముందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలర్ మొదటి భాగం విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో అనిరుద్ రవిచందర్ ఒకరు. ఆయన అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడు జైలర్ 2కు కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నందున ఈ చిత్ర మ్యూజిక్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






