Keerthy Suresh: కీర్తి కోసం 211 రోజుల నుంచి ఆ పని చేస్తున్న అభిమాని.. ఎట్టకేలకు అతని కోరిక తీర్చిన మహానటి (ట్వీట్)

by Mallepaka Hamsa |

చాలామంది సినీ సెలబ్రిటీల కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు.

Keerthy Suresh: కీర్తి కోసం 211 రోజుల నుంచి ఆ పని చేస్తున్న అభిమాని.. ఎట్టకేలకు అతని కోరిక తీర్చిన మహానటి (ట్వీట్)
X

దిశ, సినిమా: చాలామంది సినీ సెలబ్రిటీల కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. తమ అభిమాన హీరో, హీరోయిన్ సినిమా విడుదల అయిందంటే చాలు మొదటి రోజు ఫస్ట్ షో చూడాలని ఎంత ఖర్చు పెట్టి అయినా సరే వేలకు వేలు పెట్టి మరీ టికెట్ కొనుగోలు చేసి మూవీ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే థియేటర్స్ వద్ద తమ రక్తాన్ని కూడా ధారపోసి మరీ అభిషేకం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇక మరి కొంతమంది తమ అభిమాన హీరో పుట్టినరోజుకు రక్త దానాలు కూడా చేస్తుంటారు. అలాగే అన్న దానాలు కూడా చేసి ఎంతోమంది కడుపు నింపుతారు. అయితే ఓ అభిమాని తనకు నచ్చిన హీరోయిన్ సమంత(Samantha) విగ్రహం పెట్టిన విషయం తెలిసిందే.

ఇక గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ విచిత్రమైన ట్రెండ్ కొనసాగుతోంది. మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోతే చదవను.. భోజనం చేయను అని హీరో,హీరోయిన్లకు బెదిరిస్తున్నారు. అదే పనిగా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, కీర్తి సురేష్(Keerthy Suresh) అభిమాని కూడా అలాగే చేశాడు. ఏకంగా 211 రోజులుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. ఆమె రిప్లై ఇవ్వాలని తన యుద్ధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో.. కీర్తి రిప్లై ఇచ్చింది. తన కోరిక మేరకు 212వ రోజున x ద్వారా స్పందించింది. ‘‘అజయ్ పోస్టులు నేను ఇంతకు ముందే చూశాను.. అందరికీ ప్రేమ పంపుతున్నాను’’ అని పోస్ట్ పెట్టింది.

ఇక ఈ పోస్టులను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పనీ పాట లేకుండా అలా చేసే బదులు స్టడీస్‌పై కెరీర్ పెట్టొచ్చుగా అని సదరు నెటిజన్‌కు సలహా ఇస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎట్టకేలకు సాధించావ్ కోరిక తిరిందా అని అంటున్నారు. కాగా, కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆమె ‘బేబీ జాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇక కీర్తి పర్సనల్ లైఫ్ విషయంలోకి వెళితే.. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

Next Story