నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి అయిపోయింది.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-07-09 13:31:55  IST  )

‘మహర్షి’(Maharshi) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దివి(Divi) అందరికీ సుపరిచితమే.

నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి అయిపోయింది.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మహర్షి’(Maharshi) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దివి(Divi) అందరికీ సుపరిచితమే. ఈ మూవీలో ఈ బ్యూటీ చిన్న పాత్రలో కనిపించిన తన నటనత, స్క్రీన్ ప్రెజెన్స్‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన గ్లామర్‌ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీబిజీగాఉంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన బ్రేకప్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తనకు మంచి వైఫ్ దొరికింది. ప్రజెంట్ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం మేమిద్దరం మాట్లాడుకోము. ఇంకేమ్ కావాలి మనం ఇష్టపడ్డ వ్యక్తి సంతోషంగా ఉండడమే కదా మనం కోరుకునేది. అయితే వాళ్ల పేరెంట్స్ అందరికీ నేనంటే ఇష్టం కానీ మా ఇద్దరికీ రాసిపెట్టలేదు’ అని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story