- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ది లేడీ కిల్లర్' ఫ్లాప్ కావడానికి కారణం అదే.. భూమి పెడ్నేకర్
ది లేడీ కిల్లర్ ఫ్లాప్ గురించి భూమి పెడ్నేకర్ స్పందిస్తూ.. "మాకు చెప్పిన స్క్రిప్ట్ వేరు, థియేటర్లలోకి వచ్చిన సినిమా వేరు. మాకు చెప్పిన కథలో దాదాపు 30% వరకు చిత్రీకరించలేదు. సడన్గా ఒక రోజు ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అయింది, ఇంకా పెట్టే స్తోమత లేదు, ఇప్పటివరకు షూట్ చేసిన దాన్నే విడుదల చేస్తున్నాం" అని చెప్పారు. దాంతో షాక్ అయ్యాను. సినిమాను అనుకున్నట్లు తీయని కారణంగానే ఆ చిత్రం ఫ్లాప్ అయ్యుంటుందని ఈమె చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఒక సినిమా తీయాలంటే కేవలం డబ్బులు మాత్రమే ఉంటే సరిపోదు. సినిమా తీసే నిర్మాతకు సరైన ప్లానింగ్ కూడా ఉండాలి. పక్కా ప్రణాళిక లేకుండా ఓ చిత్రాన్ని స్టార్ట్ చేస్తే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సినిమాను అనుకున్న బడ్జెట్‌లో తీయనట్లయితే ఆ సినిమా థియేటర్లలోకి వచ్చి మంచి హిట్ అయినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్గా మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే తెలివైన నిర్మాతలు స్క్రిప్ట్ లాక్ అయ్యాక, అందులో నటించే నటీనటుల రేంజ్ ఎంతో అంతలోనే సినిమాను తీస్తారు.
అలాగే ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో పక్కా ప్లానింగ్తో కంప్లీట్ చేసినట్లయితే ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టం రాదు. ప్లానింగ్ లేకపోవడం వల్లే తాను నటించిన ది లేడీ కిల్లర్ మూవీ ఫ్లాప్ అయిందని భూమి పెడ్నేకర్ తాజాగా వెల్లడించింది. 2023లో విడుదల అయిన ది లేడీ కిల్లర్ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ బహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నిర్మాతకు భారీ ఎత్తున నష్టాలను మిగిల్చింది.
ఈ మూవీ ఫ్లాప్ గురించి తాజాగా భూమి పెడ్నేకర్ స్పందిస్తూ... ది లేడీ కిల్లర్ విషయంలో చెప్పిన స్క్రిప్ట్ వేరు, థియేటర్లో వచ్చిన సినిమా వేరు. మాకు కథ చెప్పిన సమయంలో ఉన్న చాలా భాగాన్ని మేకర్స్ చిత్రీకరించలేదు. దాదాపు 35 శాతం వరకు షూటింగ్ పెండింగ్ ఉన్న దశలోనే చిత్రాన్ని విడుదల చేశారు. సడన్గా ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నాకు చెప్పారు. దాంతో నేను షాక్ అయ్యాను. ఎందుకు అలా చేస్తున్నారని నేను అడగగా, ఇప్పటికే అనుకున్న దానికంటే బడ్జెట్ చాలా ఎక్కువ అయిందని, ఇంకా పెట్టే స్తోమత లేదని, ఇప్పటివరకు చిత్రీకరించిన దాన్నే విడుదల చేస్తున్నామని చెప్పారు. నేను ఒక నటిని, నా చేతుల్లో ఏమీ లేదు. నిర్మాతలు ఆ సమయంలో వారు చేసిన పని కరెక్ట్ అనుకున్నారు. ఇప్పటికే ఆ సినిమా విషయంలో అనేక గందరగోళాలు ఉన్నాయని భూమి పెడ్నేకర్ చెప్పుకొచ్చింది.






