డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఆ స్టార్ హీరో?

by Pulgam srinivas |

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఆ స్టార్ హీరో?
X

దిశ, వెబ్ డెస్క్: అడవి శేషు ప్రధాన పాత్రలో రూపొందిన డెకాయిట్ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా, అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఈ చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఈ ఈవెంట్‌కు వెంకటేష్ హాజరైతే ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు.

Next Story