Swayambhu: విడుదల తేదీ ఖరారు కావాలంటే అదే కీలకం

by Pulgam srinivas |

స్వయంభు విడుదల తేదీ ఖరారు కావాలంటే ఓటీటీ ఒప్పందం ఓకే చేయాల్సిందే.

Swayambhu: విడుదల తేదీ ఖరారు కావాలంటే అదే కీలకం
X

దిశ, వెబ్ డెస్క్: నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సంయుక్తా మీనన్, నబా నటేష్ ఇందులో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మేకర్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా విడుదల తేదీపై స్పష్టమైన క్లారిటీ లేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత దానిని ఓటీటీ వారు చూడనున్నట్లు, చూసి వారికి అవుట్పుట్ నచ్చినట్లయితే వారు ఒక తేదీని నిర్ణయించనున్నట్లు, ఆ తేదీనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా యొక్క ఓటీటీ హక్కులను జీ5 సంస్థ దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల నుండి సమాచారం అందుతుంది.

ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందుతుంది. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Next Story