- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thammudu: రేపే సినిమా రిలీజ్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ‘తమ్ముడు’ టీమ్
హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ (Thammudu).

దిశ, సినిమా: హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈమూవీ జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థ్రియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్‌కు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే సినిమాను టార్గెట్ చేస్తూ.. మూవీ ఎలా ఉన్నా కూడా నెటిగివ్‌గా ట్రోల్స్ చేస్తూ, సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ మేరకు ‘తమ్ముడు’ సినిమాను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అగౌరవపరిచే రివ్యూస్ ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని నిర్మాతలు హెచ్చరించారు. అయితే.. వారు బాధ్యతాయుతమైన విమర్శలకు సిద్ధంగా ఉన్నారు.. కానీ సినిమాను కావాలని దెబ్బతీసే లక్ష్యంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తే మాత్రం సీరియస్ పరిణామాలు ఉంటాయని తెలిపారు మూవీ టీమ్. Link






