బాలయ్య ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తమన్

by Mallepaka Hamsa |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).

బాలయ్య ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తమన్
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). దీనిని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ విడుదలై మూవీపై హైప్ పెంచాయి.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, తమన్ ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్(First single) అప్డేట్ రాబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ‘‘బ్లాక్‌బస్టర్ దువ్వు కళ్లు ఆ బ్లాక్‌బస్టర్(Blockbuster) ట్రాక్‌తో చార్ట్‌లను వెలిగించేందుకు సిద్ధమవుతున్నాయి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా బాలయ్యతో ఉన్న ఫొటో షేర్ చేశాడు. అయితే ఈ సాంగ్ డిసెంబర్ 15వ తేదీన రాబోతున్నట్లు సమాచారం.

Next Story