Thaman: రామ్ చరణ్ అభిమానులకు సారీ చెప్పిన థమన్ .. గేమ్‌ ఛేంజర్‌ ఓఎస్టీ గురించి ఏం చెప్పాడంటే..?

by Phanindra |   (  Updated:2025-02-03 11:38:42  IST  )

గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిన సినిమా గేమ్‌ఛేంజర్‌ (Game Changer).

Thaman: రామ్ చరణ్ అభిమానులకు సారీ చెప్పిన థమన్ .. గేమ్‌ ఛేంజర్‌ ఓఎస్టీ గురించి ఏం చెప్పాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిన సినిమా గేమ్‌ఛేంజర్‌ (Game Changer). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ (Shankar)‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ పతాకం పై దిల్‌ రాజు నిర్మించగా.. ఎస్‌ థమన్ మ్యూజిక్‌, అందించాడు.

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ జనవరి 10న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. మొదటి రోజు మిక్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఫుల్ రన్ లో బోల్తా పడింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అలాగే, నెగిటివిటీ ఎక్కువ అవ్వడంతో థియేటర్లలో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఇప్పటికే, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇవి నిజమేనా ? కాదా అంటూ ఎన్నో సందేహాలు వస్తున్నాయి. కొందరు, కాదని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు. మరి కొందరు నిజం కాకపోతే ఇలా ఎందుకు పోస్టులు పెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌) కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ ( Ram Charan ) ఫ్యాన్స్ కు థమన్ ( Thaman ) సారీ చెప్పాడు. ముందుగా ప్రకటించిన డేటు ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌) ఫిబ్రవరి 1న రిలీజ్ కావాల్సింది.. కానీ, ఇప్పటికే ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఆశగా చూస్తున్న ఫ్యాన్స్ కు థమన్ సారీ చెబుతూనే.. ఓఎస్టీ గురించి చెప్పేశాడు.

గేమ్ ఛేంజర్‌ ఓఎస్టీని ఈ రోజు సాయంత్రం 06 :30 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు, ఈ ఓఎస్టీ 16 ట్రాక్స్‌తో ఉంటుందని, అన్నింటిలో అప్పన్న పాత్ర చుట్టూ తిరిగే ట్రాక్ చాలా ఇష్టమని తెలిపాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ నటీ నటులు నటించారు.


Click Here Tweet..

Next Story