- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thalapathy Vijay: విజయ్ సినిమా షూటింగ్ అప్‌డేట్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. గతేడాది ‘ది గోట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న ఈయన త్వరలో ‘జన నాయగన్’ (Jana Nayagan)తో రాబోతున్నాడు. హెచ్ వినోథ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంలో.. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, శృతి హాసన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్‌లలో రిలీజ్ కానుంది. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై(Chennai)కు చెందిన పోరూర్‌లో టిఆర్ గార్డెన్‌లో జరుగుతోంది. ఇందులో విజయ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌తో విజయ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందట. అంతేకాకుండా వచ్చే నెల మధ్యలో మొత్తం షూటింగ్ పూర్తవుతుండగా.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారట చిత్ర బృందం. ప్రజెంట్ ఈ న్యూస్‌కి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా.. ఇది విజయ్ చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు కూడా ‘జన నాయగన్’ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా.. విజయ్ రాజకీయం లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అదే పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో ఎలాంటి అంశాలు చూపిస్తారా అని సినీ విశ్లేషకుల్లో కూడా క్యూరియాసిటీ నెలకొంది.
#JanaNayagan Update
— Movie Tamil (@MovieTamil4) April 13, 2025
- JanaNayagan Shooting Now going in TR Garden Porur.
- #ThalapathyVijay portions shooting is over in Few Days.
- The entire shoot over by Next Month middle.
In Cinemas JAN 9th, 2026 💥#HVinoth #PoojaHegde pic.twitter.com/KwjWq67krx






