జననాయగన్ లీక్.. మరో మూవీ ఓకే చేసిన విజయ్.. టీమ్ క్లారటీ!

by Chukka Sudharani |

దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే ‘జననాయగన్’ చిత్రం కోసం పని చేస్తున్నారు.

జననాయగన్ లీక్.. మరో మూవీ ఓకే చేసిన విజయ్.. టీమ్ క్లారటీ!
X

దిశ, సినిమా: దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే ‘జననాయగన్’ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఆయన సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెకెక్కుతోన్న ఈ మూవీని హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఎప్పటి కప్పుడు ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది. అయితే ఈ చిత్రాన్ని తాజాగా లీకులు బెడద చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన 5నిమిషాల నివిడి గల వీడియో లీక్ అవ్వగా ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే విజయ్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా లీక్ అయిన కారణం విజయ్ మరో చిత్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నట్లు వార్తలు రాగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఈ వార్తలపై దీనిపై క్లారిటీ ఇచ్చారు విజయ్ తరుపు వ్యక్తులు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. ‘జననాయగన్ లీక్ లీక్ కారణంగా దళపతి విజయ్ మరో సినిమాలో నటిస్తారని వస్తు్న్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవి పూర్తిగా నిరాధారమైనవి’ అని తెలిపారు.

Next Story