aishwaryarajesh:‘నువ్వు చేయగలవని నమ్మితే సగం దూరం వెళ్లగలవు’..మోటివేషన్ ఇస్తూ సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంటోన్న నటి

by Kodari Anjali |

తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (aishwaryarajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

aishwaryarajesh:‘నువ్వు చేయగలవని నమ్మితే సగం దూరం వెళ్లగలవు’..మోటివేషన్ ఇస్తూ సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంటోన్న నటి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (aishwaryarajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళం సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఐశ్వర్య అద్భుతమైన నటనకు నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (South Indian International Movie Awards), ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. వరల్డ్ స్పోర్ట్స్ డ్రామా కౌస్య కృష్ణమూర్తి, ఫేమస్ లవర్ (Famous Lover), రిపబ్లిక్ (Republic) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఈ ఏడాది సంక్రాంతి పండగకు సంక్రాంతి వస్తున్నాం (Saṅkranthiki vasthunnam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్య అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసిందనడంలో అతిశయోక్తిలేదు. టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ అండ్ మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆకట్టుకునే సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చింది. చీరకట్టులో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పోస్టుకు ఐశ్వర్య రాజేష్ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘నువ్వు చేయగలవని నమ్మితే సగం దూరం వెళ్లగలవు’ అని జోడించింది.

Next Story