పైర‌సీకి చెక్‌..తెలంగాణ స‌ర్కార్ కు తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీని వేధిస్తున్న‌ పైరసీ భూతాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు అణిచివేశారు.

పైర‌సీకి చెక్‌..తెలంగాణ స‌ర్కార్ కు  తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీని వేధిస్తున్న‌ పైరసీ భూతాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు అణిచివేశారు. ముఖ్యంగా ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మ‌డి రవిని అరెస్టు చేసి, సినిమా ఇండస్ట్రీకి ఊరట కల్పించారు తెలంగాణ పోలీసులు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఇందులో భాగంగానే భరణ్ భూషణ్ మాట్లాడుతూ ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని పట్టుకున్నందుకు తెలంగాణ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నిర్మాత శ్రీ కళ్యాణ్ మాట్లాడుతూ.. పైరసీ చేసే వారి పట్ల పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇకపై పైరసీ అనే భూతాన్ని రాకుండా ఆపాలని కోరారు. తమ చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన పోలీసులతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, పైరసీ అనేది పెద్ద నేరం.. దానికి పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ పైరసీ భూతం వల్ల పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల నిర్మాతలు కూడా నష్టపోతున్నారని వివరించారు. వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి కారణం పైరసీ అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి ఈ పైరసీని అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు తీస్తారన్నారు. అమ్మి రాజు మాట్లాడుతూ, పోలీసులు అలాగే ప్రభుత్వం తమ చిత్ర పరిశ్రమకు ఎంతో సహాయం చేసినట్లు గుర్తు చేశారు. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కు వచ్చి సినిమా చూడాలని కోరారు. వీర శంకర్, ముత్యాల రామ ప్రసాద్, బాపిరాజు, ప్రసన్నకుమార్ , రాంబాబు కూడా లాంటి సినిమా పెద్దలందరూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హాయ్ బొమ్మ నిర్వాహకుడు రవిని పట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story