- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirai : మరోసారి వాయిదా పడిన తేజాసజ్జా మిరాయ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిరాయ్’ (Mirai).

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిరాయ్’ (Mirai). ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. కానీ ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా పడుతూ ఆడియన్స్‌ను నిరుత్సాహపరుస్తుంది. ఇక షూటింగ్ పనులు పూర్తి కాగా.. ఎట్టకేలకు ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అదే రోజున అనుష్క (Anushka) ఘాటీ సినిమా రిలీజ్ ఉండటంతో.. మిరాయ్‌ని వాయిదా వెయ్యాలని ఫిక్స్ అయ్యారట మూవీ టీమ్. ఈ మేరకు సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాను వాయిదా వేస్తూ.. సెప్టెంబర్ 12కు పోస్ట్ పోన్ చేసినట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్‌గా మెప్పించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. లింక్






