tejasajja: క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తోన్న కుర్ర హీరో.. లేటెస్ట్ పోస్ట్ వైరల్

by Kodari Anjali |

కుర్ర హీరో తేజ సజ్జా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ హీరో చిన్నప్పుడే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

tejasajja: క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తోన్న కుర్ర హీరో.. లేటెస్ట్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కుర్ర హీరో తేజ సజ్జా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ హీరో చిన్నప్పుడే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. చూడాలని ఉంది, రాజకుమారుడు, కలిసుందాంరాం, యువరాజు, దీవించండి, బాచి, ప్రేమ సందడి, ఆకాశ వీధిలో, ఇంద్రుడు, గంగోత్రి, ఒట్టేసి చెబుతున్నా, వసంతం, అడవి రాముడు, ప్రియమాన తోళి, ఠాగూర్, సాంబా, బాలు, నా అల్లుడు, అందరివాడు, చత్రపతి, శ్రీరామదాసు, ఆస్ట్రామ్, బాస్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు.

ఇక ఓ బేబీ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత జోంబీ రెడ్డి మూవీలో అవకాశం కొట్టేసి తన నటనా రూపం చూపించాడు. తర్వాత ఇష్క్, అద్భుతం, హనుమాన్ సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అయితే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో 2 డి, 3 డి ఫార్మెట్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా ఈ నటుడు అదిరిపోయే ఫొటో షూట్ చేశాడు. క్యూట్ గా నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. కళ్లద్దాలు పెట్టుకుని దిగిన ఈ పిక్స్ అభిమానులతో పంచుకుని ఓ క్యాప్షన్ జత చేశాడు. ‘ఇంకొంచెం నవ్వుతూ’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం తేజ సజ్జా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story