Teja Sajja: తేజ సజ్జా ‘మిరాయ్’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

సూపర్ హీరో తేజ సజ్జా(Teja Sajja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

Teja Sajja: తేజ సజ్జా ‘మిరాయ్’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: సూపర్ హీరో తేజ సజ్జా(Teja Sajja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ‘హనుమాన్’(Hanuman) సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. దీంతో ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) కాంబినేషన్‌లో ‘మిరాయ్’(Mirai) మూవీ రాబోతుంది.

ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా.. రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన బజ్ సృష్టించాయి.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషలలో 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త షూటింగ్ షెడ్యూల్ ముంబై గుహలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ముంబైలోని చారిత్రాత్మక గుహలలో సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో తేజ సజ్జాతో పాటు, కొంతమంది ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం షూటింగ్ పనులు చకచకా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story