Teja Sajja: విజువల్ వండర్‌గా తేజా సజ్జా మూవీ.. షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్

by Chukka Sudharani |

యంగ్ హీరో తేజా సజ్జా ‘హనుమాన్’ చిత్రంతో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.

Teja Sajja: విజువల్ వండర్‌గా తేజా సజ్జా మూవీ.. షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా ‘హనుమాన్’ చిత్రంతో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా.. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. గౌర హరి సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. రీసెంట్ వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ కాగా.. ఇందులో నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. ‘మిరాయ్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా.. ఇందులో తేజా సజ్జా సూపర్ యోధగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా.. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story