- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teja Sajja: బిగ్ అడ్వెంచర్ లోడింగ్.. ‘మిరాయ్’ మూవీ అప్డేట్ ఇచ్చిన హీరో.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
తేజా సజ్జా(Teja Sajja) చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: తేజా సజ్జా(Teja Sajja) చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ‘బేబీ’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. ‘హనుమాన్’(Hanuman) మూవీతో ఘన విజయం సాధించాడు. దీంతో ఒక్కసారిగా ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇందులో రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తుండగా.. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో 2D,3D ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తేజ సజ్జా ‘మిరాయ్’ నుంచి అప్డేట్ ఇచ్చాడు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మే 28న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు.. ‘‘బిగ్ అడ్వెంచర్ లోడింగ్. ఇతిహాస అనూభూతిని అనుభవించేందుకు వేచి ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక పోస్టర్ గమనించినట్లు అయితే.. ఇందులో ఓ ట్రైన్ వెళ్తుండగా.. తేజ సజ్జా దానిపై ఎక్కి పెద్ద కట్టె పట్టుకుని రన్నింగ్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఇక ఇందులో ‘‘మే 28 తర్వాత ఏదీ ఒకేలా ఉండదు’2 అని రాసి ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






