- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనం మనుషుల మధ్య ఉన్నామా?.. క్యూరియాసిటీ పెంచేస్తున్న ‘కామాఖ్య’ టీజర్
by Chukka Sudharani |
‘జబర్దస్త్’ ఫేమ్ హాస్యనటుడు అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘కామాఖ్య’ నుంచి టీజర్ రిలీజైంది.

X
దిశ, సినిమా: ‘జబర్దస్త్’ ఫేమ్ హాస్యనటుడు అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘కామాఖ్య’. సముద్ర ఖని, సమైరా, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ చూస్తుంటే.. ఓ మిస్టరీ కేసు ఆధారంగా రూపొందినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతుంది. ఆనంద్, శరణ్య ప్రదీప్, మధనందన్, వైష్ణవ్, ధన్‌రాజ్, ఐశ్వర్య, గడ్డం నీవీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Next Story






