- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకట్టుకునేలా ‘సందిగ్ధం’.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సీన్స్‌తో మెప్పిస్తున్న టీజర్
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న చిత్రం ‘సందిగ్ధం’.

దిశ, సినిమా: సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న చిత్రం ‘సందిగ్ధం’. సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన అ మూవీలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కి సరిపడగా ఉండటంతో.. ప్రజెంట్ ఇది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. దర్శకుడు పార్ద సారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ విషయంలో ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి కథ ఇంత వరకు రాలేదని చెప్పొచ్చు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటే ఈ చిత్రాన్ని మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్లను మీడియా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
- Tags
- Sandigdham
- Teaser






