Teaser : ఆకట్టుకుంటోన్న ‘జూనియర్’ టీజర్.. సీరియస్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా

by Chukka Sudharani |

మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kiriti Reddy) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జూనియర్’.

Teaser : ఆకట్టుకుంటోన్న ‘జూనియర్’ టీజర్.. సీరియస్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా
X

దిశ, సినిమా: మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kiriti Reddy) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జూనియర్’. యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree leela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. వరాహి చలనచిత్ర బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఎవర్ గ్రీన్ బ్యూటీ జెనీలీయా (Genelia) చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా జూలై 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం అండ్ మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈక్రమంలో.. జూనియర్ మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో హీరో ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే వాడిలో ఉంటాడు.. అలాగే బీటెక్ చదువుకునే ఈ హీరో నాలుగేళ్లలో చదువు ఎప్పుడు చదువుకోవచ్చు.. మెమోరీస్ ముఖ్యం అంటూ ఫ్రెండ్స్, గొడవలు అంటూ ఉంటాడు. ఇక శ్రీలీల లైఫ్‌లో ఓ గోల్ లేనివాడు అసలు మనిషే కాదు అనే క్యారెక్టర్. వీరిద్దరి మధ్య లవ్ ఎలా వర్కౌట్ అవుతుందనేది కథ అయితే.. టీజర్ లాస్ట్‌లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇస్తుంది జెనీలియా. మొత్తంగా ఈ టీజర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆకట్టుకుంటోంది.Link

Next Story