- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్ట్రేషన్ బుక్‌తో టీజర్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి టీజర్ 8వ తేదీన రాబోతుంది.

దిశ, సినిమా: డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటిస్తున్న ఈ మూవీని యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. రవీంద్రన్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమా ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘వర్షాకాలం కొంత ప్రేమను కోరుతోంది.. కాబట్టి.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి టీజర్‌ను 8వ తేదీన సాయంత్రం 4:24 గంటలకు విడుదల చేయబోతున్నాం.. త్వరలో తెలుగు & తమిళంలో థియేటర్స్‌లో సందడి చేయనుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో.. రిజిస్ట్రేషన్ బుక్ కనిపిస్తుండగా.. పేరు, ఊరు, ఆధార్ నెంబర్ నమోదు చేసి ఉంది. ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్టర్‌తో మరింత క్యూరియాసిటీ నెలకొంది. లింక్






