- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్‌డే స్పెషల్‘ కరుప్పు’ నుంచి టీజర్ రిటీజ్.. ఊరమాస్ లుక్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’(Karuppu).

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’(Karuppu). ఆర్జే బాలాజీ(RJ Balaji) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. ఇక ఇందులో సూర్య సరసన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కాగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీ నుంచి రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ క్రమంలో తాజాగా నేడు సూర్య బర్త్‌డే స్పెషల్‌గా మూవీ నుంచి టీజర్(Teaser) రిలీజ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సూర్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్‌లో ‘కొబ్బరికాయ కొట్టి కర్పురం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగివచ్చే దేవుడు’ అనే ఊరమాస్ డైలాగ్‌తో వీడియో స్టార్ అవుతుంది. ఇక కత్తి పట్టుకొని మాస్‌లుక్‌లో సూర్య కనిపించాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, ఫైటింగ్ సీన్స్, సూర్య డైలాగ్స్ అన్ని సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్ వేసేయండి.






