- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ నటి జయశ్రీగా తమన్నా.. పింక్ చీరలో ఫస్ట్ లుక్(వీడియో)
అభిజీత్ శిరీష్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి. శాంతారాం’. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసిన వి. శాంతారాం గారి జీవిత కథే ఈ సినిమా. యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. తమన్నా భాటియా ఆయన రెండో భార్య నటి

దిశ, సినిమా : అభిజీత్ శిరీష్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి. శాంతారాం’. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసిన వి. శాంతారాం గారి జీవిత కథే ఈ సినిమా. యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. తమన్నా భాటియా ఆయన రెండో భార్య నటి జయశ్రీ పాత్రలో కనిపించబోతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆమె థాంక్స్ పోస్ట్ పెట్టింది. ఇప్పటికే ఈ ప్రయాణం చాలా డీప్‌గా, అర్థవంతంగా ఉందని తెలిపింది. జయశ్రీగా మారడం తాను ఊహించిన దానికంటే ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఇచ్చిందని.. ఈ ప్రయాణం మరిన్ని అద్భుతాలను తెస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. భారతీయ సినిమా రంగంలో చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడిగా విశిష్ట సేవలు అందించిన వి. శాంతారాం గారికి ఈ సినిమా నివాళిగా మారనుంది. ఇక ఈ పోస్టర్‌లో తమన్నా పింక్ నవ్వారి చీరలో వింటేజ్ గ్రేస్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసి, అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ ప్రయాణం నుంచి మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాను – ఇది ఇప్పటికే చాలా డీప్‌గా ఉంది. ఇక ఈ పోస్టర్‌లో తమన్నా పింక్ చీరలో వింటేజ్ గ్రేస్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసి, అద్భుతంగా కనిపించింది.






