పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి!

by Muthe.Rajitha |   (  Updated:2025-08-03 16:53:42  IST  )

టాలీవుడ్, బాలీవుడ్ లోనూ తన అందంతో, అభినయంతో బోలెడు ఛాన్సులు కొల్లగొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) గురించి మనందరికీ తెలిసిందే.

పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్, బాలీవుడ్ లోనూ తన అందంతో, అభినయంతో బోలెడు ఛాన్సులు కొల్లగొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్దు గుమ్మ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు గుప్పుమన్నాయి. వరుడు ఎవరో కాదు పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్క్రికెటర్(Abdul Razak). నటుడు విజయ్ వర్మతో బ్రేక్ అప్ చెప్పిన తర్వాత ఈ బ్యూటీ రజాక్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తమన్నా ఘాటుగానే స్పందించింది.

తాను ఎవరినీ పెళ్లి చేసుకోబోవడం లేదని పేర్కొంది. అబ్దుల్ రజాక్ తాను ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్నామని, అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కూడా తమన్నా డేటింగ్ లో ఉన్నట్టు రూమర్స్ రాగా.. తామిద్దరం ఒక యాడ్ లో కలిసి పని చేశామని.. దానికి ఇలాంటి వార్తలు రావడం బాధ కలిగించింది అని ఆవేదన చెందింది ఈ అమ్మడు.

Also Read..

ఎంతో మంది తల్లులు నాకు ఫోన్ చేసి ఆ విషయం గురించి చెప్తున్నారు.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story