- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Takshakudu: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న దేవరకొండ సినిమా !
తాజాగా తక్షకుడు ( Takshakudu) అనే సినిమాను ఆనంద్ దేవరకొండ చేశాడు. ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించాడు

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. తన అన్న విజయ్ కంటే డిఫరెంట్ గా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు ఆనంద్ దేవరకొండ. అయితే అలాంటి ఆనంద్ దేవరకొండ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా తక్షకుడు ( Takshakudu) అనే సినిమాను ఆనంద్ దేవరకొండ చేశాడు.
ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఆనంద్ దేవరకొండ పాత్ర ఊర మాస్ రేంజ్ లో ఉంటుందట. ఈ మేరకు తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్తులు అంటూ పోస్టర్ కూడా వదిలింది. ఈ పోస్టర్ లో గన్ పట్టుకుని మాస్ లుక్ లో మెరిసారు ఆనంద్.






