- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Retro: మాస్ ఎంటర్‌టైన్మెంట్ ఖాయం.. ట్రైలర్‌తో మరింత హైప్
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కాంబినేషన్‌లో వస్తున్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro).

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కాంబినేషన్‌లో వస్తున్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ బ్యానర్స్‌పై దీనిని సూర్య, జ్యోతిక (Jyothika) నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అప్పటి నుంచి సూర్య యాక్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక తాజాగా ఆ తరుణం రానేవచ్చింది.. ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
‘యుద్ధం ఇచ్చే మత్తు ఉంటుందే.. అదొక పారవశ్యం’ అంటూ విలన్ రాక్షతత్వంతో మొదలైన ఈ ట్రైలర్(Trailer)లో యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఎంతో నేచురల్‌గా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే.. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు రెట్రో ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది. కాగా.. జయరామ్, కరుణాకరన్, వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అకట్టుకోగా.. సూర్య యాక్షన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన ట్రైలర్‌తో బిగ్ స్క్రీన్‌పై మూవీ ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
Here is the trailer of #Retro
— karthik subbaraj (@karthiksubbaraj) April 18, 2025
Tamil - https://t.co/yfk6mhlE1l
Telugu - https://t.co/di749tNEQg
Hindi - https://t.co/brmKWNRzv7#TheOne From May One ! #RetroTrailer#RetroAudioLaunch #LoveLaughterWar #RetroFromMay1 pic.twitter.com/akMeTpkkC5






