- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Surya-46: షూటింగ్ సెట్స్‌లో సూర్య, మమితా బైజు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
by Chukka Sudharani |
తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం ‘సూర్య-46’తో బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా: తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం ‘సూర్య-46’తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. రవీనా టాండన్, రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు షూటింగ్‌గా బిజీ అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించారట మేకర్స్. ఈ షూటింగ్‌లో 22 రోజులపాటు జరగనుందని తెలుస్తుండగా.. తాజాగా సూర్య, మమితా బైజు షూటింగ్ సెట్స్‌లో అడుగు పెట్టినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. సెట్స్ నుంచి మమితా, సూర్యలకు సంబంధించిన పలు ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లింక్
Next Story






