Surya-46: వెంకీ అట్లూరి-సూర్య సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్(వీడియో)

by I. Sairam |   (  Updated:2025-05-19 12:56:12  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya), వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబోలో ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Surya-46: వెంకీ అట్లూరి-సూర్య సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya), వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబోలో ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సూర్య-46 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. సూర్య సరసన ఈ మూవీలో హీరోయిన్‌గా మమిత బైజు(Mamitha Baiju) నటిస్తోందట.

ఇక రియాల్టీ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సూర్య-46 మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story