Suriya : రేసు నుంచి తప్పుకున్న కరుప్పు.. ఆ రెండు సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గిన సూర్య

by Chukka Sudharani |

డైరెక్టర్ ఆర్జే బాలాజీ లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’ (Karuppu).

Suriya : రేసు నుంచి తప్పుకున్న కరుప్పు.. ఆ రెండు సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గిన సూర్య
X

దిశ, సినిమా: డైరెక్టర్ ఆర్జే బాలాజీ లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’ (Karuppu). రూరల్ బ్యా్క్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా నటిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రం కూడా పోటీ పడబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం అందుకున్న సమాచారం మేరకు ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుడుకున్నట్లు తెలుస్తుంది. అదే టైమ్‌లో దళపతి విజయ్ జన నాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి రిలీజ్ ఉండటంతో.. సూర్య కరుప్పు మూవీ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ చిత్రంలో త్రిష(trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. యోగిబాబు, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్ రెడ్డి, శశివాడ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. లింక్


Next Story